Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఓటర్ల జాబితాతో బీజేపీ కుట్ర: అఖిలేశ్ యాదవ్

Akhilesh Yadav Alleges BJP Conspiracy With Voter Lists
Advertisement
  • దొంగ ఓట్లను చేర్పిస్తూ, ప్రతిపక్షాల ఓట్లను తొలగిస్తున్నారని అఖిలేశ్ విమర్శ
  • పోలింగ్ బూత్‌ల వద్ద కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పిలుపు
  • మోసం, నిజాయతీ లేకపోవడాన్నే బీజేపీ తన బలంగా భావిస్తుందని వ్యాఖ్య
Advertisement
సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ కుట్రపూరితంగా ఓటర్ల జాబితాను తారుమారు చేస్తోందని, దొంగ ఓట్లను చేర్పించడంతో పాటు ప్రతిపక్ష మద్దతుదారుల ఓట్లను తొలగిస్తోందని ఆయన విమర్శించారు. లక్నోలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

పోలింగ్ బూత్‌ల వద్ద పార్టీ కార్యకర్తలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా అవకతవకలు గుర్తిస్తే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. "మోసం, నిజాయతీ లేకపోవడాన్నే బీజేపీ తన బలంగా భావిస్తుంది. అందుకే ఇలాంటి కుట్రలకు పాల్పడుతోంది" అని అఖిలేశ్ అన్నారు.

కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ప్రకటించిన తర్వాత అఖిలేశ్ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవలే వేల కోట్లు ఖర్చుపెట్టి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పూర్తి చేసిన తర్వాత, మళ్లీ ఇప్పుడు SSR అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఇది కేవలం బీజేపీకి అనుకూలంగా జాబితాను మార్చేందుకేనని ఆయన ఆరోపించారు.
Advertisement
Advertisement
Akhilesh Yadav
Samajwadi Party
BJP
Voter List Manipulation
Uttar Pradesh Politics
Election Commission of India

More Telugu News